కరోనా: హెటిరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ రూ. 5 కోట్ల విరాళం | Sakshi
Sakshi News home page

కరోనా: హెటిరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ రూ. 5 కోట్ల విరాళం

Published Mon, Apr 13 2020 5:48 PM

Hetero Group Of Companies Donates RS 5 Crores For AP CM Relief fund - Sakshi

సాక్షి, అమరావతి : కోవిడ్‌-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి హెటిరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ రూ. 5 కోట్లు విరాళం అందజేసింది. ఈ సందర్భంగా హెటిరో గ్రూపు ఎండీ వంశీ కృష్ణ.. విరాళానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు. దీంతోపాటు కోటి రూపాయలతో పీపీఈ కిట్స్, మందులు, మాస్క్‌లు అందజేశారు. విశాఖ జిల్లా కలెక్టర్‌కు సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌తో పాటు నక్కపల్లిలో శానిటైజేషన్‌, మందులు, నిత్యావసర సరుకుల పంపిణీకి మరో రెండు కోట్లు అందజేశామని హెటిరో డ్రగ్స్‌ ప్రతినిధులు తెలిపారు. (అత్యవసర ప్రయాణాలకు ఏపీ సరికొత్త నిర్ణయం )

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భాగంగా  దేవి సీ ఫుడ్స్‌ లిమిటెడ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు విరాళం అందజేసింది. ఈ మేరకు దేవి సీ ఫుడ్స్‌ లిమిటెడ్‌ ఎండీ బ్రహ్మనందరం.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు చెక్కును అందజేశారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం నందలూరు రాయల్ మెడికల్స్ ప్రొప్రైటర్ అరిగే మని.. ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ద్వారా  సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 100000/- లక్ష రూపాయలు పంపారు. (సీసీసీకి వైజ‌యంతీ మూవీస్‌ రూ. 5 ల‌క్ష‌లు విరాళం)

అమరావతి : కరోనా వ్యతిరేక పోరాటానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని రూ. 83 లక్షల 86 వేల 747 విరాళంగా అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్‌ వై వి సుబ్బారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్ధానం ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌కు ఈ విరాళానికి సంబంధించిన డీడీను అందజేశారు. (నన్నే ఆపేస్తారా.. లేదు అరెస్టు చేస్తాం! )

Advertisement
Advertisement