శ్రీవారి సేవలో అర్జున్ | hero Arjun visit the tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో అర్జున్

Dec 7 2014 3:08 AM | Updated on Sep 2 2017 5:44 PM

శ్రీవారి సేవలో అర్జున్

శ్రీవారి సేవలో అర్జున్

సినీ హీరో అర్జున్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం కుటుంబ...

సినీ హీరో అర్జున్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీవారిని, వకుళమాతను దర్శించుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించారు. వేద పండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. జైహింద్-2 చిత్రం  విజయవంతంగా ప్రదర్శిస్తోందని, త్వరలోనే మరో కొత్త చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.  
 - సాక్షి,తిరుమల
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement