భారతదేశంలో కశ్మీర్, రాష్ట్రంలో లంబసింగి చలితో వణుకుతుంటే...మూడు రోజులుగా చలి ప్రభావంతో జిల్లా ప్రజలు గడగడ వణుకుతున్నారు.
సాక్షి, కడప : భారతదేశంలో కశ్మీర్, రాష్ట్రంలో లంబసింగి చలితో వణుకుతుంటే...మూడు రోజులుగా చలి ప్రభావంతో జిల్లా ప్రజలు గడగడ వణుకుతున్నారు. చలిపులి విసిరుతున్న పంజాకు భయపడి ఉదయాన్నే బయటికి రావాలంటే భయపడుతున్నారు. చలికి తట్టుకోలేక కొందరు చలిమంటలు ఆశ్రయిస్తున్నారు. తెల్లారి 8 దాటినా చలి వదలడం లేదు. దీంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లే సమయంలో కూడా స్వెట్టర్లు ధరించి వెళుతున్నారు. మరోవైపు
చలికి సంబంధించినదుస్తులకు మార్కెట్‌లో డిమాండ్ ఏర్పడింది.
తగ్గిపోయిన ఉష్ణోగ్రతలు...
జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. ఇటీవల గరిష్ఠంగా 29 డిగ్రీలు, కనిష్టం 16 డిగ్రీలకు పడిపోయాంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఇట్టే అర్థమవుతోంది.చలి అధికం కావడంతో ఉబ్బసం, అస్తమా, టీబీ, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.