ఇటీవల వరుస తుఫాన్లు, భారీ వర్షాలతో వణికిన రాష్ట్రంపై మరోసారి అల్పపీడన ప్రభావం చూపే అవకాశముంది.
ఇటీవల వరుస తుఫాన్లు, భారీ వర్షాలతో వణికిన రాష్ట్రంపై మరోసారి అల్పపీడన ప్రభావం చూపే అవకాశముంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇటీవల వచ్చిన తుఫాన్లు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యం కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీని ప్రభావంతో పంటలకు అపారనష్టం వాటిల్లింది. లక్షలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ఇళ్లు, కొబ్బరిచెట్లు, విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి.