బెజవాడలో భారీ వర్షం: వీధులన్నీ జలమయం | heavy rains in vijayawada city | Sakshi
Sakshi News home page

బెజవాడలో భారీ వర్షం: వీధులన్నీ జలమయం

Jun 4 2016 12:59 PM | Updated on Sep 4 2017 1:40 AM

విజయవాడ నగరంలో శనివారం భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని రహదారులన్నీ నీటమునిగాయి.

విజయవాడ : విజయవాడ నగరంలో శనివారం భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని రహదారులన్నీ నీటమునిగాయి. దీంతో నగరంలో జనజీవనం స్తంభించింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి భారీ వర్షం ప్రారంభం కాగా, ఆ తర్వాత వర్షం ఉధృతి తగ్గినప్పటికీ మధ్యాహ్నం వరకూ వర్షం కురుస్తూనే ఉంది. వన్‌టౌన్‌లోని పలు ప్రాంతాలు, లోబ్రిడ్జి, పోరంకి, మొగల్‌రాజపురం, మధుచౌక్, జమ్మిచెట్టు సెంటర్ తదితర ప్రాంతాల్లోని రోడ్లన్నీ నీటమునిగాయి. దీంతో నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement