పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. అలాగే ఉపరితల ఆవర్తనం కోస్తాంధ్ర మీదుగా ఆవరించి ఉంది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రా, రాయలసీమల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అలాగే తెలంగాణ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.