
భవానీలతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
భవానీ దీక్ష విరమణ కోసం వచ్చిన భక్తులతో దుర్గమ్మ కొండ ఎరుపెక్కింది.
ఇంద్రకీలాద్రి: భవానీదీక్ష విరమణ కోసం వచ్చిన భక్తులతో దుర్గమ్మ కొండ ఎరుపెక్కింది. ఐదు రోజుల దీక్ష విరమణోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి భవానీలు భారీగా తరలివస్తున్నారు. స్నానాల కోసం వచ్చిన భవానీ భక్తులతో కృష్ణానది తీరం ఎరుపు మయమైంది.