జలాశయాలకు భారీగా వరద నీరు | Heavy Flood Water in Nagarjuna Sagar, srisailam Dams | Sakshi
Sakshi News home page

జలాశయాలకు భారీగా వరద నీరు

Aug 2 2014 9:36 AM | Updated on Sep 2 2017 11:17 AM

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలకు వరద నీరు పోటెత్తింది.

హైదరాబాద్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. శనివారం ఉదయానికి నాగార్జునసాగర్లో నీటి మట్టం 512.40 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులో ఇన్ఫ్లో 49 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1800 క్యూసెక్కులు ఉందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.

అలాగే శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 841 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో 1,50, 938 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 4,944 క్యూసెక్కులు ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జూరాల ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement