ఆరోగ్యవంతమైన సమాజానికి అందరూ కృషి చేయాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు.
శ్రీకాకుళం సిటీ : ఆరోగ్యవంతమైన సమాజానికి అందరూ కృషి చేయాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని శనివారం రిమ్స్‌లో ఎంపీ రామ్మోహన్‌నాయుడు, జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనల క్ష్మి, ఎమ్మెల్యే గుండ ల క్ష్మీదేవి, కలెక్టర్ పి. లక్ష్మీనరసింహం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మాతా శిశు మరణాలను నివారించాలనేది కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు.
ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పీఎంఎస్‌ఎంఏ కార్యక్రమాన్ని జిల్లాలోని 24 ఆస్పత్రుల్లో ప్రాథమికంగా ప్రారంభించారని చెప్పారు. కార్యక్రమం కింద ప్రతి నెలా 9వ తేదీన గ ర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి మాట్లాడుతూ పీఎంఎస్‌ఎంఏ మంచి కార్యక్రమమని అన్నారు. వైద్యులు ఇచ్చే సూచనలు, సల హాలను తప్పక పాటించాలని కోరారు. ఎమ్మె ల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ గర్భిణుల అవసరాలను గుర్తించాలన్నారు. కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం మాట్లాడుతూ పీఎంఎస్‌ఎంఏ కార్యక్ర మం కింద గర్భిణులకు అవసరమైన ల్యాబ్ పరీక్షలు, స్కానింగ్, పోషకాహారం వంటి విషయాల్లో చక్కటి సూచనలు, సలహాలు అందిస్తున్నట్లు తెలిపారు.
జననీ సురక్ష యోజన పథకం కింద ఆస్పత్రిలో ప్రసవాలకు గ్రామీణ స్త్రీలకు రూ. 1,000, పట్టణ స్త్రీలకు రూ. 600లు పారితోషికం అం దిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రిమ్స్ ఆస్పత్రిలో పీఎంఎస్‌ఎంఏ కింద గర్భిణులకు చేపట్టే ఆరోగ్య పరీక్షల రికార్డును అతిథులు విడుదల చేశారు. పీఎంఎస్‌ఎంఏ కార్యక్రమానికి సంబంధించిన వివిధ విభాగాలను రిమ్స్‌లో ప్రారంభించారు.
కార్యక్రమంలో రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ బీఎల్‌ఎన్ ప్రసాద్, పీఎంఎస్‌ఎంఏ నోడల్ అధికారి డాక్టర్ ఆర్. అరవింద్, రిమ్స్ సూపరిం టెండెంట్ డాక్టర్ కె. సునీల్‌నాయక్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మెండ ప్రవీణ్, డీసీహ చ్‌ఎస్ డాక్టర్ బి. సూర్యారావు, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ వాణిశ్రీ, రిమ్స్ సీఎస్ ఆర్‌ఎంవో బీసీహెచ్ అ ప్పలనాయుడు, సత్యసాయి సేవా సంస్థల నుంచి కె.కాళీప్రసాద్, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.