JP Chairperson
-
భంగపాటు!
► జెడ్పీ సీఈవో బదిలీ విషయంలో భంగపడ్డ జెడ్పీ చైర్పర్సన్ ► నెలరోజుల క్రితం సీఈవోను పంపించేస్తామని బహిరంగ ప్రకటన ► తాజా బదిలీలో నగేష్ పేరు లేకపోవడంతో డీలా ► మంత్రులు, రాష్ట్ర అధికారులతో సుదీర్ఘ మంతనాలు ► వినాయక చవితి అనంతరం రాజధాని వెళ్లే యోచనలో చైర్పర్సన్ వర్గం ► ప్రస్తుతానికి సీఈవోదే పైచేయి! ‘‘జెడ్పీ సీఈవో మాకు సహకరించడం లేదు. జిల్లా పరిషత్‌కు సంబంధించి తనకే సర్వాధికారాలు ఉండగా తాము చెప్పినట్లు చేయకుండా ప్రతి ఫైల్‌ను కలెక్టర్‌కు నివేదిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. అందువల్ల సీఈవో నగేష్‌ను పంపించేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటికే మంత్రులతో మాట్లాడాను. అవసరమైతే పైస్థాయి వారితో కూడా మాట్లాడుతా’’ అంటూ నెలరోజుల క్రితం జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. అయితే ఆమె మాట చెల్లలేదు. తాజాగా ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో శ్రీకాకుళం జిల్లా సీఈవో పేరు లేకపోవడంతో చైర్‌పర్సన్‌కు భంగపాటు తప్పలేదు. ప్రస్తుతానికి సీఈవోదే పైచేయి అని జెడ్పీ వర్గాలు భావిస్తున్నాయి. శ్రీకాకుళం: జిల్లా పరిషత్ సీఈవో నగేష్, చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మిల మధ్య కొన్ని నెలలుగా నెలకొన్న విభేదాలు ప్రస్తుతం తారస్థాయికి చేరుకున్నాయి. సీఈవో తమ మాట వినడం లేదని చైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దీంతో అతన్ని ఎలాగైనా ఇక్కడ నుంచి పంపించేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని విలేకరుల సమక్షంలో ప్రకటించేశారు. ఇటువంటి ప్రకటన జిల్లా చరిత్రలో గతంలో ఎన్నడూ..ఎవరూ చేయలేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య అభిప్రాయభేదాలు వస్తే పైస్థాయి అధికారులకు, సంబంధిత శాఖ మంత్రులకు ఫిర్యాదు చేస్తామనో చెప్పారే తప్పా నేరుగా అధికారిని పంపించేస్తామని ప్రకటించిన దాఖలాల్లేవు. అయితే చైర్పర్సన్ ధనలక్ష్మి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. సీఈవోను పంపించేయడానికి ఏర్పాట్లు పూర్తయినట్టు చెప్పేశారు. ఇటువంటి ప్రకటన చేయగానే సీఈవో నగేష్ కూడా అప్రమత్తమయ్యారు. మంత్రి అచ్చెన్నాయుడును కలిసి తనకష్ట సుఖాలను చెప్పుకున్నట్టు సమాచారం. అంతావిన్న ఆయన చైర్‌పర్సన్‌కు ఇష్టం లేన్నప్పుడు ఇక్కడ ఉండడం దేనికని అనడంతో సీఈవో కూడా బదిలీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ పక్క ప్రయత్నం చేస్తూనే ఆయనకు ఉన్న పరిచయడంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కలిసి తన కష్టాలను చెప్పుకున్నారు. తనకు బదిలీ చేయాలని, అవసరమైతే మాతృ సంస్థకు పంపించాలని కూడా కోరినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇటువంటి నేపథ్యంలో సీఈవో నగేష్‌కు బదిలీ తప్పదని అందరూ భావించారు. అయితే పంచాయతీరాజ్ శాఖామంత్రి సీఈవోది తప్పులేదని భావించారో... మరేదైనా కారణమో తెలియకపోయినా గురువారం రాష్ట్రం లోని ఏడు జెడ్పీలకు సీఈవోలను నియమించగా, అందులో శ్రీకాకుళం లేకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి డీలా పడ్డారు. ఎంతో ఆర్భాటంగా చేసిన ప్రకటనకు విరుద్ధంగా పరిస్థితి ఉండడంతో తీవ్ర ఆవేదనతో గురువారం రోజంతా రాష్ట్ర మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులతో సుదీర్ఘంగా మం త్రాంగం జరిపినట్లు తెలియవచ్చింది. అవసరమైతే వినాయ క చవితి తర్వాత రాజధానికి వెళ్లి సీఈవోకు బదిలీ అయ్యేవరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తనతో పాటు జెడ్పీటీసీ సభ్యులను కూడా తీసుకెళ్లి సీఈవో తీరు కారణంగా అభివృద్ధి కుంటుపడుతోందని చెప్పించాల ని కూడా వ్యూహరచన జరిపినట్లు బోగట్టా. సీఈవో మాత్రం తనకు ఎప్పుడు బదిలీ అయిన తక్షణం రిలీవ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏదిఏమైనా ప్రస్తుతానికి మాత్రం ఈ బదిలీ వ్యవహారంలో సీఈవోదే పైచేయి అయ్యిందన్న వాదన జెడ్పీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. అలాగే తొందరపాటుతో జెడ్పీచైర్‌పర్సన్ బహిరంగ ప్రకటన చేశారన్న వాదన కూడా ఉంది. ఈ వ్యవహారం ఎటువంటి మలుపులకు దారితీస్తుందో రెండు, మూడు రోజుల్లో తేలనుంది. -
ఆరోగ్యవంతమైన సమాజానికి కృషి
శ్రీకాకుళం సిటీ : ఆరోగ్యవంతమైన సమాజానికి అందరూ కృషి చేయాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని శనివారం రిమ్స్‌లో ఎంపీ రామ్మోహన్నాయుడు, జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనల క్ష్మి, ఎమ్మెల్యే గుండ ల క్ష్మీదేవి, కలెక్టర్ పి. లక్ష్మీనరసింహం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మాతా శిశు మరణాలను నివారించాలనేది కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పీఎంఎస్ఎంఏ కార్యక్రమాన్ని జిల్లాలోని 24 ఆస్పత్రుల్లో ప్రాథమికంగా ప్రారంభించారని చెప్పారు. కార్యక్రమం కింద ప్రతి నెలా 9వ తేదీన గ ర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి మాట్లాడుతూ పీఎంఎస్ఎంఏ మంచి కార్యక్రమమని అన్నారు. వైద్యులు ఇచ్చే సూచనలు, సల హాలను తప్పక పాటించాలని కోరారు. ఎమ్మె ల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ గర్భిణుల అవసరాలను గుర్తించాలన్నారు. కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం మాట్లాడుతూ పీఎంఎస్ఎంఏ కార్యక్ర మం కింద గర్భిణులకు అవసరమైన ల్యాబ్ పరీక్షలు, స్కానింగ్, పోషకాహారం వంటి విషయాల్లో చక్కటి సూచనలు, సలహాలు అందిస్తున్నట్లు తెలిపారు. జననీ సురక్ష యోజన పథకం కింద ఆస్పత్రిలో ప్రసవాలకు గ్రామీణ స్త్రీలకు రూ. 1,000, పట్టణ స్త్రీలకు రూ. 600లు పారితోషికం అం దిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రిమ్స్ ఆస్పత్రిలో పీఎంఎస్ఎంఏ కింద గర్భిణులకు చేపట్టే ఆరోగ్య పరీక్షల రికార్డును అతిథులు విడుదల చేశారు. పీఎంఎస్ఎంఏ కార్యక్రమానికి సంబంధించిన వివిధ విభాగాలను రిమ్స్‌లో ప్రారంభించారు. కార్యక్రమంలో రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ బీఎల్ఎన్ ప్రసాద్, పీఎంఎస్ఎంఏ నోడల్ అధికారి డాక్టర్ ఆర్. అరవింద్, రిమ్స్ సూపరిం టెండెంట్ డాక్టర్ కె. సునీల్‌నాయక్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మెండ ప్రవీణ్, డీసీహ చ్ఎస్ డాక్టర్ బి. సూర్యారావు, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ వాణిశ్రీ, రిమ్స్ సీఎస్ ఆర్ఎంవో బీసీహెచ్ అ ప్పలనాయుడు, సత్యసాయి సేవా సంస్థల నుంచి కె.కాళీప్రసాద్, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కలెక్టర్‌తో ఢీ
ఉపాధి నిధులతో రోడ్లకు ప్రతిపాదించిన కలెక్టర్ నాయక్ ఆయన పెత్తనాన్ని సహించలేకపోతున్న చైర్పర్సన్ శోభారాణి ముఖ్యమంత్రికి... రాష్ట్ర మంత్రికీ ఫిర్యాదులు గతంలోనూ మంత్రి మృణాళిని, ఎమ్మెల్సీ జగదీష్‌తోనూ రగడ వారితోనూ ఉపాధి నిధులపైనే యుద్ధం జెడ్పీ చైర్పర్సన్ ఉపాధి నిధుల పనులకోసం యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు కలెక్టర్‌ను ప్రత్యక్షంగా ఢీకొంటున్నారు. ఆ మాటకొస్తే... ఆమె స్వపక్షీయులతో... అంటే సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి మృణాళిని, జిల్లా పార్టీ అధ్యక్షుడు జగదీష్‌తోనూ పోరాడారు. అదీ ఉపాధి నిధులపైనే... అసలు వీటిపైనే ఆమె ఎందుకు అంత పట్టుబడుతున్నారనేదే చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు రావకపోవడమా...? ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ పనులు తప్ప మరే అవకాశమూ లేకపోవడమా...? సాక్షి ప్రతినిధి, విజయనగరం : పదవి అన్నాక పెత్తనం ఉండకపోతే ఎలా? ఏదో ఒకటి చేయకపోతే ఎవరు పట్టించుకుంటారని అనుకున్నారో ఏమో తెలియదు గాని ఉపాధి హామీ పథకం మెటీరియల్ పనుల విషయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కలెక్టర్‌తో యుద్ధం చేస్తున్నారు. తమ ఆమోదం లేకుండా, జెడ్పీ తీర్మానం తీసుకోకుండా మెటీరియల్ కాంపోనెంట్ పనులను మంజూరు చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో ఈ పనులు జోరుగా సాగడం లేదని, సుమారు రూ. 200కోట్లు ఖర్చు కాకపోవడంవల్ల వెనక్కి పోయే పరిస్థితి వచ్చిందని, అటు సీఎం, ఇటు పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించడంతో తప్పని పరిస్థితుల్లో కలెక్టర్ పనులు మంజూరు చేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కలెక్టర్‌కు ఆ అధికారం లేదంటూ వాదన కన్వర్జెన్సీ నిధులతో చేపట్టే పనులను మాత్రమే కలెక్టర్‌కు మంజూరు చేసే అధికారాన్ని ఇచ్చారని, పూర్తిస్థాయి ఉపాధి మెటీరియల్ నిధులతో చేపట్టే పనులకు మంజూరు అధికారం లేదని జెడ్పీ చైర్పర్సన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి మెటీరియల్ పనుల విషయంలో మంజూరు చేసే పూర్తి అధికారాలు కలెక్టర్‌కు ఉన్నాయని, పనుల మంజూరు విషయంలో ఇంత రాద్ధాంతం ఎందుకని అధికార వర్గాలు చెబుతున్నాయి. పైగా కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తుంటే సంతోషించాలే తప్ప అడ్డంకులు సృష్టించడం సరికాదని ఆ వర్గాలు వాదిస్తున్నాయి. ఇవేమీ పట్టించుకోని జెడ్పీ చైర్పర్సన్ సీఎం, మంత్రుల దగ్గరకు వెళ్లి వినతి పత్రాలు ఇస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు మంజూరు చేశారని మొర పెట్టుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ జెడ్పీ చైర్పర్సన్, కలెక్టర్ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. గతంలోనూ ఇదే తీరు గతంలో మంత్రి కిమిడి మృణాళినితో నువ్వానేనా అన్నట్టు ఢీకొన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌తో పోరు సాగించారు. గతేడాది జనవరిలో ఉపాధి మెటీరియల్ కాంపోనెంట్ పనుల కేటాయింపు విషయంలో మంత్రి మృణాళిని, జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వాతిరాణి మధ్య పెద్ద వివాదమే నడిచింది. రూ.35కోట్లతో చేపట్టే ఈ పనులకోసం జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి మండలాల వారీగా కేటాయించి, ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లను కోరారు. మరోవైపు మంత్రి మృణాళిని కూడా మండలానికి రూ.80లక్షల నుంచి రూ.కోటి వరకు ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని ఎమ్మెల్యేలను కోరారు. విషయం తెలుసుకున్న జెడ్పీచైర్‌పర్సన్ సీరియస్‌గా స్పందించారు. ఉపాధి పనుల కేటాయింపులో మంత్రి పెత్తనమేంటని, తాను వేరేగా నాయకుల నుంచి పనుల ప్రతిపాదనలు తీసుకోవడమేంటని మండిపడ్డారు. తమ శాఖ పరిధిలోకి వచ్చే నిధుల కావడం వల్లనే ప్రతిపాదనలు తీసుకున్నామని మంత్రి సమర్ధించుకున్నప్పటికీ వారిద్దరి మధ్య పోరు తీవ్ర స్థాయిలో కొనసాగింది. జగదీష్‌తో ఒకసారి మంత్రితో పోరు సద్దుమణిగిన కొన్నాళ్ల తర్వాత ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌తో ఇవే పనుల విషయంలో రగడ చోటు చేసుకుంది. పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాల పరిధిలో సుమారు రూ.5.29కోట్లు విలువ గల 30 పనుల్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ ప్రతిపాదించారు. కలెక్టర్‌కు తమ ప్రతిపాదనలు అందజేశారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు సై అన్నారు. తనకు తెలియకుండా, తన ద్వారా కాకుండా ఉపాధి పనుల్ని జగదీష్ ప్రతిపాదించడాన్ని చైర్పర్సన్ స్వాతిరాణి జీర్ణించుకోలేకపోయారు. జగదీష్‌తో పరోక్షంగా పోరుకు దిగారు. మొత్తమ్మీద స్వాతి రాణి పోరాటం ఏమేరకు విజయవంతమవుతుందో వేచి చూడాలి.