ఆరోగ్యమే మహాభాగ్యం

Health is wealth - Sakshi

24, 25 తేదీల్లో ‘సాక్షి’ గుడ్‌ హెల్త్‌ మెగా షో

ఉచిత వైద్య పరీక్షలు, సందేహాల నివృత్తి

వేదిక : మాగుంట లేఅవుట్, అనిల్‌గార్డెన్స్‌

నెల్లూరు(బారకాసు): మారుతున్న ఆహారపు అలవాట్లు.. శారీరక శ్రమ లేకపోవడం.. పనిఒత్తిడి.. వెరసి చిన్న వయసులోనే అనారోగ్యాలకు గురువుతున్నారు. మూడు పదుల వయస్సులోనే మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు చుట్టముట్టడంతో గుండె, కిడ్నీ, లివర్, కంటి సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆరోగ్యకర జీవన విధానం, ఆయా వ్యాధులను అధిగమించడం ఎలా? వ్యాధులు ఉన్న వారు ఎలాంటి చికిత్సలు తీసుకోవాలనే సందేహాలను నివృత్తి చేసేందుకు ‘సాక్షి’ చక్కటి వేదికను ఏర్పాటు చేసింది. నెల్లూరు అపోలో హాస్పిటల్‌ ప్రధాన స్పాన్సర్‌గా నిర్వహిస్తున్న గుడ్‌హెల్త్‌ మెగా షోని ఈ నెల 24, 25 తేదీల్లో మాగుంట లేఅవుట్‌లోని అనిల్‌గార్డెన్‌లో నిర్వహించనున్నారు. ఇందులో ఆరోగ్య సమస్యల గురించి వివరించడంతోపాటు పలు వైద్య పరీక్షలు ఉచితంగా చేసేందుకు నెల్లూరు నగరంలోని ప్రముఖ హాస్పిటల్స్‌ ముందుకొచ్చాయి.

‘సాక్షి’ గుడ్‌హెల్త్‌ మేగా షోలో పాల్గొనే ఆస్పత్రులు

అపోలో హాస్పిటల్‌: గుండెజబ్బులు, నరాల, మూర్చ, పక్షవాతం, కిడ్నీ తదితర ప్రధాన వ్యాధులకు సంబంధించి ప్రముఖ వైద్య నిపుణులు అవగాహన కల్పించి పలు సూచనలు ఇస్తారు. 

సాయిపథం హాస్పిటల్‌: కాన్పులు, గర్భకోశవ్యాథులపై అవగాహన కల్పిస్తారు. సంతాన సాఫల్యం వంటి అంశాలతో పాటు జనరల్‌ సర్జరీలకు సంబంధించి వైద్యరంగంలో వచ్చిన నూతన వైద్యవిధానాల్లో భాగంగా ఎలాంటి కోత లేకుండా ల్యాప్రోస్కోపిక్‌ ద్వారా కేవలం చిన్న రంధ్రం వేసి ఆపరేషన్‌ చేసే సదుపాయం గురించి డాక్టర్‌ వంగిమళ్ల రాధామాధవి వివరిస్తారు.

మాడరన్‌ ‘ఐ’ హాస్పిటల్‌: కంటి వ్యాధులు ఎలా, ఎందుకు వస్తాయి. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కంటి సమస్యలు ఉన్న వారు ఎలాంటి చికిత్సలు పొందాలనే విషయాలపై డాక్టర్‌ పీఎల్‌.రావు అవగాహన కల్పిస్తారు.

రత్నం హాస్పిటల్‌: శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల్లో నెమ్ము, ఆయాసం, ఉబ్బసం తదితర వ్యాధులకు సంబంధించిన జబ్బులపై డాక్టర్‌ పిట్టి మల్లికార్జునరావు అవగాహన కల్పించనున్నారు. 
ఆయుష్‌ దంతవైద్యశాల: ఉచితంగా దంత వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు నోటి ఆరోగ్యంపై ప్రముఖ దంత వైద్య నిపుణుడు డాక్టర్‌ ఉమ్రాన్‌ అవగాహన కల్పిస్తారు.

రవి చిన్నపిల్లల హాస్పిటల్‌: చిన్నపిల్లల వ్యాధులకు సంబంధించి వైద్యులు పాల్గొంటారు. అవసరమైన చిన్నారులకు పలు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. పిల్లల్లో తరచుగా వచ్చే వ్యాధుల పట్ల ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్‌ రవికుమార్‌తోపాటు తన వైద్య బృందం హాజరై అవగాహన కల్పించనున్నారు. అదేవిధంగా సందేహాలను నివృత్తి చేస్తారు.

ఉమా మహేష్‌ న్యూరో హాస్పిటల్‌: నరాలు, మెదడుకు సంబంధించిన పక్షవాతం, మూర్ఛ, మతిమరుపు లాంటి జబ్బులు నివారణపై అవగాహన కలిగిస్తారు. ఈవ్యాధులు వచ్చే అవకాశాలు ఎలా ఉంటాయి, అవిరాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్‌ ఉమామహేష్‌ వివరిస్తారు. 

మైధిలి హాస్పిటల్‌(మెటర్నిటి అండ్‌ ఫర్టిలిటి సెంటర్‌): కాన్పులు,గర్భకోశ వ్యాదులు, సంతానం లేని వారికి ఎటువంటి ప్రత్యేక చికిత్స ఉందనే విషయాలను వివరిస్తారు. మహిళలు తమకున్న అనారోగ్య సమస్యలపై ఉన్న సందేహాలను డాక్టర్‌ జి.మైధిలి నివృత్తి చేస్తారు.

చెన్నై హాస్పిటల్స్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ సెంటర్‌: చెన్నైలోని ఉన్న అన్ని ప్రముఖ హాస్పిటల్స్‌కు సంబందించిన పూర్తి సమాచారాన్ని తెలియచేస్తారు. అక్కడున్న హాస్పిటల్స్‌లో ఏహాస్సిటల్‌లో ఎటువంటి వైద్య సదుపాయాలున్నాయనే విషయాలను కూడా తెలియచేయనున్నారు.
 
కేబీఆర్‌ ఆర్థోపెడిక్‌ హాస్పిటల్‌:
డాక్టర్‌ గరిక సతీష్‌  ఎముకలు, కీళ్లు, నరాల శస్త్రచికిత్సలకు సంబందించిన విషయాలపై అవగాహన కల్పించనున్నారు. మోకాలి చిప్పలు అరుగుదల వచ్చే సమస్యలపై వివరిస్తారు.

బాలాజీ ఈఎన్‌టీ హాస్పిటల్‌: చెవి,ముక్కు, గొంతు వ్యాధులకు సంబందించిన పలు విషయాలపై డాక్టర్‌ దేసు మురళి అవగాహన కల్పిస్తారు.

సహజ డయాబెటిస్‌ అండ్‌ థైరాయిడ్‌ క్లీనిక్‌: మధుమేహం, థైరాయిడ్‌ గ్రంథి సమస్యలు, పిల్లల్లో ఎదుగుదల లోపాలు, శారీరక వికాసలోపం, స్థూలకాయం, మోనోపాజ్, అధిక కొలెస్ట్రాల్‌ సమస్యలపై డాక్టర్‌ ఆలూరు సహజ అవగాహన కలిగిస్తారు. షుగర్, థైరాయిడ్‌కు సంబంధించిన పరీక్షలు ఉచితంగా చేస్తారు.

నవ్య ఆయుర్వేదిక్‌ హాస్పిటల్‌: అన్ని రకాల వ్యాధులకు సంబందించి ఆయుర్వేదంలో ఉన్న వైద్య సదుపాయాలు గురించి డాక్టర్‌ రాజశేఖర్‌ వివరిస్తారు.

ఆయుష్‌ ఆయుర్వేద వైద్యశాల: ఆయుర్వేద వైద్యం వలన ఎటువంటి ఫలితాలుంటాయనే విషయాలను డాక్టర్‌ స్వాతి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారు. 

విఘ్నేశ్వర స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ సెంటర్‌: పుట్టకతోను, చిన్నారుల్లో వచ్చే వినికిడి లోపాలు గురించి వివరిస్తారు. అందుకు ఎటువంటి చికిత్సలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించేందుకు ఆడియాలజిస్ట్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ పాల్గొంటారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top