కాలేజీలో హెడ్మాస్టర్ ఆత్మహత్య | Headmaster suicide in degree college | Sakshi
Sakshi News home page

కాలేజీలో హెడ్మాస్టర్ ఆత్మహత్య

Jan 31 2015 8:48 AM | Updated on Nov 6 2018 7:56 PM

కాలేజీలో హెడ్మాస్టర్ ఆత్మహత్య - Sakshi

కాలేజీలో హెడ్మాస్టర్ ఆత్మహత్య

కృష్ణాజిల్లా అవనిగడ్డ డిగ్రీ కాలేజీలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మచిలీపట్నం: కృష్ణాజిల్లా అవనిగడ్డ డిగ్రీ కాలేజీలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ విషయాన్ని శనివారం కళాశాల సిబ్బంది గుర్తించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన డిగ్రీ కాలేజీకి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు.

పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహన్ని మచిలీపట్నంలోని జిల్లా వైద్య ఆసుపత్రికి తరలించారు. మృతుడు నాగాయలంక మండలం ఎదురుమొండి హైస్కూల్ హెడ్మాస్టర్గా పోలీసులు గుర్తించారు. హెడ్మాస్టర్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement