ఆ పోటీలకు దూరంగా పిల్లలను ఉంచా : సచిన్ భార్య అంజలి | he start of the World Cup cricket matches | Sakshi
Sakshi News home page

ఆ పోటీలకు దూరంగా పిల్లలను ఉంచా : సచిన్ భార్య అంజలి

Feb 15 2015 2:48 AM | Updated on Sep 2 2017 9:19 PM

ఆ పోటీలకు దూరంగా పిల్లలను ఉంచా :  సచిన్ భార్య అంజలి

ఆ పోటీలకు దూరంగా పిల్లలను ఉంచా : సచిన్ భార్య అంజలి

2011...ప్రపంచకప్ పోటీలు ... జరుగుతున్నదీ భారత్‌లోనే... ఫైనల్ మ్యాచ్ శ్రీలంకతో భారత్ తలపడుతోంది. దోనీ కెప్టెన్‌గా ఉన్న ఆ టీం

ప్రపంచ కప్  క్రికెట్ పోటీలు  ప్రారంభం

2011...ప్రపంచకప్ పోటీలు ... జరుగుతున్నదీ భారత్‌లోనే... ఫైనల్ మ్యాచ్ శ్రీలంకతో భారత్ తలపడుతోంది. దోనీ కెప్టెన్‌గా ఉన్న ఆ టీం వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. సచిన్ కల ఫలించింది. దేశమంతా ఒళ్లంతా కళ్లు చేసుకుని టీవీలకు అతుక్కుపోయింది. సచిన్ కుటుంబం మాత్రం టీవీలకు దూరంగా ఉంది. ఎందుకంటే వారి పిల్లలకు ఆ మరుసటి రోజునే పరీక్షలు. పిల్లల్ని  చదివించుకుంటూ ఉన్నానని సచిన్ భార్య  అంజలి పత్రికలకు చెప్పారు.

భవితకే ప్రాధాన్యం
 
కోట్లకు అధిపతులు ... చదువు ఒడుదొడుకుల్లో పడినా పెద్ద ఇబ్బందులేమీ ఆ కుటుంబాలకు ఉండవు. కానీ, చదువుకే వారు ప్రాధాన్యం ఇచ్చారు. భవితకు పునాదులు వేయడానికి వాళ్లు ఎంతగా తపన పడుతున్నారో ఈ రెండు ఉదాహరణలు చాలు. కానీ, చాలామంది యువత భవిష్యత్తును తేలికగా తీసుకుని తాత్కాలిక ఆనందాలకే పెద్దపీట వేస్తున్నారు.  ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. సుమారు నెలరోజుల పాటు జరుగుతాయి.

ఇవి కొనసాగినన్నాళ్లూ తరగతి గదులు ఖాళీ అవడం సంప్రదాయంగా వస్తున్నదే. కానీ నేటి పోటీ ప్రపంచంలో ఒక్క రోజు క్లాస్ మిస్సయినా వెనుక‘బడి’పోయినట్టే. అందుకే ఇటు చదువు...అటు క్రికెట్‌ను సమన్వయం చేసుకుంటామని అంటున్నారు నేటి విద్యార్థులు. అవసరమైతే క్రికెట్‌కు దూరంగా ఉంటాం, భవితకే పెద్ద పీట వేస్తామని ‘సాక్షి’కి చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement