ప్రతిపాదనల చిట్టా.. రైలెక్కాలి పట్టా

Guntur Krishna MP Arranged Meeting On Pending Railway Projects - Sakshi

రైల్వే జీఎం గజానన్‌ మాల్యాతో రాష్ట్ర ఎంపీల సమావేశం

పాల్గొన్న కృష్ణా, గుంటూరు జిల్లాల ఎంపీలు

రెండు జిల్లాల్లోని కొత్త ప్రతిపాదనలు 

రాష్ట్రానికి కేంద్రం కొత్త రైల్వే జోన్‌ ప్రకటించిన నేపథ్యంలో రైల్వే పరంగా ఉన్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కృష్ణా, గుంటూరు జిల్లాల ఎంపీలు రైల్వే జీఎం గజానన్‌ మాల్యాకు విన్నవించారు. తమ నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల వివరాలు, వాటిని పూర్తి చేసేందుకు కేటాయించాల్సిన నిధులు.. ఇతరత్రా సమస్యలు ప్రస్తావిస్తూ ప్రతిపాదనలు సమర్పించారు. పలు ప్రాంతాలకు కావాల్సిన కొత్త రైళ్లు, రైల్వే స్టేషన్‌ల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన.. రైల్వేల పరంగా ప్రజలు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను జీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిందిగా కోరారు. 

సాక్షి, విజయవాడ: రైల్వే శాఖకు సంబంధించి రాష్ట్రంలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారం సహా పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి, తదితర అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా విజయవాడలో సమావేశమయ్యారు. స్థానిక సత్యనారాయణపురంలోని ఈటీటీఎస్‌లో నిర్వహించిన సమావేశంలో రెండు జిల్లాలకు చెందిన ఎంపీలతో పాటు విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ రైల్వే అధికారులు పాల్గొన్నారు. కాగా విజయవాడ నుంచి కొత్త రైళ్లు, కొత్త రైల్వే లైన్ల కోసం అనేక వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు స్పందించనందుకు సమావేశం నుంచి ఎంపీ కేశినేని శ్రీనివాస్‌(నాని) బాయ్‌కాట్‌ చేశారు. అంతకుముందు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌తో కలిసి పలు సమస్యలపై విజ్ఞాపన పత్రం అందజేశారు. విజయవాడ–మేళ్ల చెరువు రైల్వేలైను, విజయవాడ–భద్రాచలం రైల్వేలైనుకు అవసరమైన ఆర్‌ఓబీ వెంటనే మంజూరు చేయాలని.. బెంగళూరు, ముంబై, వేలాంగణి ప్రాంతాలకు 
కొత్త రైళ్లు ఏర్పాటు చేయాలని కోరారు.  

మోడల్‌ స్టేషన్‌గా బందరును తీర్చిదిద్దండి   
మచిలీపట్నం రైల్వేస్టేషన్‌ను మోడల్‌రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దాలని బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి జీఎంకు విన్నవించారు. అలాగే వారానికి మూడు రోజులు మాత్రమే నడిచే మచిలీపట్నం– బెంగళూరు కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ను రెగ్యూలర్‌ రైలుగా మార్చాలని కోరారు. మరిన్ని ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి.

► మచిలీపట్నం–విశాఖపట్నం పాసింజర్‌ రైలును ఎక్స్‌ప్రెస్‌ రైలుగా మార్చి, ఏసీ బోగీలను ఏర్పాటు చేయాలి. దీనివల్ల విశాఖ–మచిలీపట్నం మధ్య ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది. కాకినాడ– షిర్డీసాయి నగర్‌ ఎక్స్‌ప్రెస్‌కు గుడివాడలో కొన్ని అదనపు బోగీలు కలపాలి. దీనివల్ల కృష్ణాజిల్లా వాసులకు షిర్డీనగర్‌ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. 
► పినాకినీ ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ నుంచి కాకుండా మచిలీపట్నం నుంచి నడపాలి.  
► మచిలీపట్నం–బీదర్, బీదర్‌–మచిలీపట్నం, ధర్మవరం–మచిలీపట్నం, విజయవాడ–మచిలీపట్నం, మచిలీపట్నం–గుడివాడ రైళ్లకు వడ్లమన్నాడులో హల్ట్‌ ఇవ్వాలని స్థానికులు కోరుతుండటంతో పరిశీలించాలి.
► విజయవాడ–జగ్గయ్యపేట–సిక్రిందాబాద్‌ మధ్య గూడ్స్‌ రైలు మార్గం ఉంది. ఆ మార్గంలో పాసింజర్‌ రైలు ఏర్పాటు చేయాలి. దీనవల్ల రెండు లక్షల మంది రైల్వే ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుంది. 

బాపట్లలో వెయిటింగ్‌ హాల్‌ అవసరం
బాపట్ల స్టేషన్‌లో ఏవీటీఎంలను రెండు, మూడు ప్లాట్‌ఫారాలపై ఏర్పాటు.. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్‌.. ప్రయాణికులకు వెయిటింగ్‌ హల్‌ ఏర్పాటు చేయాలని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ విన్నవించారు. అలాగే వాహనాల పార్కింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. మరిన్ని వినతులు ఇవి..
► వేమూరు నియోజకవర్గం వలివేరు గ్రామంలో హాల్టింగ్‌ రైల్వేస్టేషన్‌ ను పునరుద్ధరించాలి.
► వేమూరు రైల్వేస్టేషన్‌ నందు గలం రైల్వే పార్కు పెండింగ్‌ పనులు సత్వరం పూర్తి చేయాలి. 
► చీరాల సమీపంలోని పందిళ్లపల్లి రైల్వేస్టేషన్‌ గ్రీనరీగా మార్చాలి.
► సంతనూతలపాడు నియోజకవర్గం అమ్మనబ్రోలు గ్రామం రైల్వేస్టేషన్‌ నందు రిజర్వేషన్‌ బుకింగ్‌ కౌంటర్‌ను పునరుద్ధరించాలి. 
► చీరాల నియోజకవర్గం పైర్‌ ఆఫీసు వద్ద ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలి.
► వేటపాలెం రైల్వేస్టేషన్‌ నందు బుకింగ్‌ కౌంటర్‌ ఏర్పాటు చేయాలి. 

డెమో రైలు వద్దు  
మాచర్ల–భీమవరం మధ్యలో నడుస్తున్న మరుగుదొడ్లు లేని డెమో రైలుతో గుంటూరు, విజయవాడ తర్వాత వెళ్లే ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. డెమో స్థానంలో పాతపద్ధతిలో రైలు ప్రవేశపెట్టాలని నర్సారావు పేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కోరారు. 
► అలాగే లెవెల్‌ క్రాసింగ్స్‌ 92, 93, 95, 98 వద్ద ఏర్పాటు చేసిన రోడ్డు అండర్‌ బ్రిడ్జీల వద్ద వర్షపు నీరు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని.. అక్కడ మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన విన్నవించిన విషయాలు ఇవి..
► సత్తెనపల్లి, వినుకొండ, నడికుడి, పిడుగురాళ్లలో ఎలక్ట్రానిక్‌ కోచ్‌ ఇండికేటర్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం. 
► సికింద్రాబాద్‌–వినుకొండ మధ్య నేరుగా రైలు ఏర్పాటు చేయాలి.
► నల్లపాడు–నంద్యాల సెక్షన్‌లో ఎలక్ట్రిఫికేషన్‌ పూర్తయినందున వినియోగంలోకి తీసుకురావాలి.
► మాచర్ల–గద్వాలా–రాయ్‌చూర్‌ రైల్వే లైను ఐదు దశాబ్దల క్రితం మంజూరు కాగా ఇప్పటి వరకు గద్వాల–రాయచూర్‌ మధ్య మాత్రమే పనులు పూర్తయ్యాయి.. గద్వాల– మాచర్ల మధ్య పనులు పూర్తి చేయాలి.
► మాచర్ల–భీమవరం మధ్యలో నడుస్తున్న మరుగుదొడ్లు లేని డెమో రైలుతో గుంటూరు, విజయవాడ తర్వాత వెళ్లే ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. డెమో స్థానంలో పాతపద్ధతిలో రైలు ప్రవేశపెట్టాలని నర్సారావు పేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కోరారు. 
► అలాగే లెవెల్‌ క్రాసింగ్స్‌ 92, 93, 95, 98 వద్ద ఏర్పాటు చేసిన రోడ్డు అండర్‌ బ్రిడ్జీల వద్ద వర్షపు నీరు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని.. అక్కడ మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన విన్నవించిన విషయాలు ఇవి..
► సత్తెనపల్లి, వినుకొండ, నడికుడి, పిడుగురాళ్లలో ఎలక్ట్రానిక్‌ కోచ్‌ ఇండికేటర్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం. 
► సికింద్రాబాద్‌–వినుకొండ మధ్య నేరుగా రైలు ఏర్పాటు చేయాలి.
► నల్లపాడు–నంద్యాల సెక్షన్‌లో ఎలక్ట్రిఫికేషన్‌ పూర్తయినందున వినియోగంలోకి తీసుకురావాలి.
► మాచర్ల–గద్వాలా–రాయ్‌చూర్‌ రైల్వే లైను ఐదు దశాబ్దల క్రితం మంజూరు కాగా ఇప్పటి వరకు గద్వాల–రాయచూర్‌ మధ్య మాత్రమే పనులు పూర్తయ్యాయి.. గద్వాల– మాచర్ల మధ్య పనులు పూర్తి చేయాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top