'అన్న' ను అవమానించిన తెలుగు తమ్ముళ్లు | group war in tdp | Sakshi
Sakshi News home page

'అన్న' ను అవమానించిన తెలుగు తమ్ముళ్లు

Apr 26 2015 2:49 PM | Updated on Aug 11 2018 3:38 PM

రెండుగా వర్గాలుగా చీలిపోయి ఘర్షణకు దిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. ఏకంగా తమ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి ఘోర అవమానం తలపెట్టిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగింది.

రెండుగా వర్గాలుగా చీలిపోయి ఘర్షణకు దిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. ఏకంగా తమ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి ఘోర అవమానం తలపెట్టిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగింది. ఆదివారం మండల టీడీపీ సమావేశానికి హాజరైన మంత్రి పీతల సుజాత తీరును వ్యతిరేకిస్తూ ఓ వర్గానికి చెందినవారు ఆందోళనకు దిగారు. దీంతో సమావేశం రసాభసగా మారింది.

మంత్రి రాజీనామా చేయాలని, మండలంలో ప్రస్తుతం ఉన్న కమిటీని రద్దుచేసి కొత్త కమిటీని వేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ క్రమంలోనే జంగారెడ్డి గూడెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నల్ల దుస్తులు కప్పి నిరసన తెలిపారు. విభేదాల సంగతి ఎలా ఉన్నా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి అవమానం తలపెట్టడంపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement