లక్ష రూపాయల విలువ చేసే స్థలం కోసం ఓ మనవడు తాత గొంతు కోశాడు
లక్ష రూపాయల విలువ చేసే స్థలం కోసం ఓ మనవడు తాత గొంతు కోశాడు. ఈ ఘటన సైదాపురం మండలంలోని తూర్పుపొన్ల గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది. తూర్పుపొన్ల గ్రామానికి చెందిన ముత్తంగి క్రిష్టయ్య(67)కు లక్ష రూపాయల విలువ చసే స్థలం ఉంది. ఆ స్థలాన్ని తనకు ఇవ్వాలని మనవడు శివ(22) కొద్దికాలంగా బలవంతపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా ఆస్తి దక్కించుకోవాలని యోచించిన శివ.. బహిర్భూమికి వెళ్ళిన తాత గొంతు కోసి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.