గవర్నర్ దంపతుల పుష్కర స్నానం | governor narasimhan takes holy dip in river krishna in vijayawada | Sakshi
Sakshi News home page

గవర్నర్ దంపతుల పుష్కర స్నానం

Aug 17 2016 11:26 AM | Updated on Sep 4 2017 9:41 AM

గవర్నర్ దంపతుల పుష్కర స్నానం

గవర్నర్ దంపతుల పుష్కర స్నానం

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు కృష్ణా పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించారు.

విజయవాడ : ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు కృష్ణా పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించారు. సతీ సమేతంగా బుధవారం విజయవాడలోని పున్నమి ఘాట్‌కు చేరుకున్న గవర్నర్ పుష్కర స్నానం ఆచరించి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 
అనంతరం గవర్నర్ దంపతులు దుర్గమ్మను దర్శించుకున్నారు. వారికి స్వాగతం పలికిన ఈవో సూర్యకుమారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కనక దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అందరికి తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానన్నారు. రెండు సంవత్సరాల్లో వరుసగా గోదావరి, కృష్ణా పుష్కరాల్లో పుణ్య స్నానం చేసే అవకాశం రావడం అదృష్టమన్నారు. పుష్కర ఏర్పాట్లు బాగున్నాయని కితాబిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement