ఒకసారి భార్యా బిడ్డల గురించి ఆలోచించండి

Government Chief Whip Srikanth Reddy Visited the Body of a Farmer Who Committed Suicide - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలానికి చెందిన రైతు శంకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం పట్ల ప్రభుత్వ చీఫ్‌ విస్‌ శ్రీకాంత్‌ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బుధవారం శంకర్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన ఆయన మృతుని కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా.. రైతు బాగుంటేనే ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులు మేలు కోరి అనేక నిర్ణయాలు తీసుకుంటుందని, రైతులెవరూ నిరాశ, నిస్పృహలకు లోనుకావద్దని విజ్ఞప్తి చేశారు. అఘాయిత్యానికి పాల్పడే ముందు ఒకసారి కుంటుంబం, భార్యాబిడ్డల గురించి ఆలోచించాలని సూచించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top