కాకినాడ-కోటిపల్లి రహదారిలో కాజులూరు మండలం గొల్లపాలెం మహిమా చర్చి వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో
గొల్లపాలెంలో కారు, ఆటో ఢీ
Dec 24 2013 4:23 AM | Updated on Sep 2 2017 1:53 AM
గొల్లపాలెం(కాజులూరు),న్యూస్‌లైన్ : కాకినాడ-కోటిపల్లి రహదారిలో కాజులూరు మండలం గొల్లపాలెం మహిమా చర్చి వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్యావటానికి చెందిన ఆటోలో ఎనిమిది మంది ప్రయాణికులు కాకినాడ నుంచి ద్రాక్షారామ వెళుతున్నారు. గొల్లపాలెం మహిమా చర్చి సెంటర్ వద్ద కోటిపల్లి నుంచి కాకినాడ వెళుతున్న కారు ఎదురుగా ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో బోల్తాపడ్డ ఆటో, కారు ముందుభాగం నుజ్జయ్యాయి. ఆటోలో ఉన్న రాయపాటి సత్యనారాయణ, ఉప్పుమిల్లి వెంకటరావు, శ్రీనివాస్ తీవ్రంగా, మరో ఐదుగురు, కారులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆటోలో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గొల్లపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement