స్విమ్మింగ్‌లో బంగారు పతకం | gold medal in swimming | Sakshi
Sakshi News home page

స్విమ్మింగ్‌లో బంగారు పతకం

Nov 9 2013 12:48 AM | Updated on Sep 2 2017 12:25 AM

జాతీయస్థాయి మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో జిల్లాకు చెందిన మాజీ సైనికుడు జె.లక్ష్మీనారాయణరెడ్డి అద్భుతమైన ప్రతిభను కనపరచి బంగారు పతకం సాధించాడు.

కర్నూలు(స్పోర్ట్స్), న్యూస్‌లైన్:  జాతీయస్థాయి మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో జిల్లాకు చెందిన మాజీ సైనికుడు జె.లక్ష్మీనారాయణరెడ్డి అద్భుతమైన ప్రతిభను కనపరచి బంగారు పతకం సాధించాడు. 60 నుంచి 64 ఏళ్లలోపు విభాగం 400 మీటర్ల ఫ్రీస్టయిల్ స్విమ్మింగ్ పోటీల్లో ఈయన విజేతగా నిలిచాడు. 400 మీటర్ల ఫ్రీస్టయిల్ దూరాన్ని ఏడు నిముషాల 54 సెకండ్స్‌లో పూర్తి చేసి రికార్డ్ సాధించాడు. గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్‌లో అక్టోబర్ 25 నుంచి 27 వరకు ఈ పోటీలు జరిగాయి. జిల్లా స్విమ్మింగ్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా క్రీడాసంఘాల ప్రతినిధులు జాతీయస్థాయిలో బంగారు పతకం సాధించిన జె.లక్ష్మీనారాయణరెడ్డికి అభినందనలు తెలియజేశారు. కాగా, ఈయన 2012లో మధ్యప్రదేశ్ రాష్ట్రం భూపాల్‌లో జరిగిన 9వ జాతీయస్థాయి మాస్టర్స్ ఫ్రీస్టయిల్ 400 మీటర్ల స్విమ్మింగ్ పోటీల్లో రజత పతకం కైవసం చేసుకున్నాడు. అలాగే 2011 బెంగుళూరులో జరిగిన జాతీయస్థాయి మాస్టర్స్ స్విమ్మింగ్ పోటీల్లో రజత పతకం సాధించాడు. రాష్ట్రస్థాయి మాస్టర్స్ స్విమ్మింగ్ పోటీల్లో  200, 400 మీటర్ల ఫ్రీ స్టయిల్ అంశంలో రెండు బంగారు పతకాలు కైవసం చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement