కర్నూలు జిల్లా బనగానపల్లె కొండపేట కాలనీలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు.
బనగానపల్లె: కర్నూలు జిల్లా బనగానపల్లె కొండపేట కాలనీలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో రంగాచారి అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి విలువైన సొత్తును అపహరించారు. రంగాచారి కుటుంబ సభ్యులు తలుపు తాళం వేయకుండా ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా... దొంగలు తమ పనిని సులువుగా చక్కబెట్టుకుపోయారు.
8 తులాల బంగారం, రూ.80 వేల నగదు చోరీకి గురైనట్టు బాధితుడు రంగాచారి పేర్కొంటున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.