బోటులో వెళ్లింది 77 మంది

Godavari Boat Accident No Identity For 16 Members - Sakshi

మరో మృతదేహం గుర్తింపు 

నేటికీ 16 మంది జాడలేదు

సాక్షి ప్రతినిధి బృందం, రాజమహేంద్రవరం : దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రమాద ఘటనలో మరో 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గురైన సమయంలో బోటులో 73 మంది ఉన్నారని తొలుత భావించారు. కానీ బాధితులు, కుటుంబ సభ్యుల నుంచి అందుతున్న సమాచారాన్ని క్రోడీకరించి ఆ సమయంలో బోటులో 77 మంది ఉన్నట్టు లెక్కగట్టారు. ప్రమాదం జరిగిన ఆదివారం నుంచి గురువారం వరకూ 34 మృతదేహాలు లభ్యం కాగా.. శుక్రవారం విశాఖకు చెందిన మ«ధుపాడ అరుణ (26) మృతదేహం లభ్యం కావడంతో మృతుల సంఖ్య 35కు చేరింది. ఏపీæకు చెందిన 9 మంది, తెలంగాణకు చెందిన ఏడుగురి ఆచూకీ లభించాల్సి ఉంది.

ఆచూకీ తెలియాల్సిన వారి పేర్లు
1. సంగాడి నూకరాజు (55), బోటు డ్రైవర్, కాకినాడ
2. పోతాబత్తుల సత్యనారాయణ (60), అసిస్టెంట్‌ డ్రైవర్, కాకినాడ
3. చెట్లపల్లి గంగాధర్‌ (35), నరసాపురం, పశ్చిమ గోదావరి
4. మధుపాడ కుషాలి (3), విశాఖపట్నం
5. మధుపాడ అఖిలేష్‌ (5), విశాఖపట్నం
6. తలారి గీతావైష్ణవి (5), విశాఖపట్నం
7. తలారి ధాత్రిఅనన్య (2), విశాఖపట్నం
8. బాచిరెడ్డి విఖ్యాతరెడ్డి (6), నంద్యాల (ప్రస్తుతం ఉంటున్నది విశాఖలో)
9. కర్రి మణికంఠ (24), బోటు సహాయకుడు, పాత పట్టిసీమ
10. సురభి రవీందర్‌ (25), హాలియాసాగర్, నల్గొండ జిల్లా
11. అంకెం పవన్‌కుమార్‌ (50), ఉప్పల్, హైదరాబాద్‌
12. అంకెం వసుంధర భవాని (43), ఉప్పల్, హైదరాబాద్‌
13. కొమ్ముల రవి (40), కడపికొండ, వరంగల్‌
14. కొండూరి రాజ్‌కుమార్‌ (40), కడిపికొండ, వరంగల్‌
15. కారుకూరి రమ్యశ్రీ (22), నన్నూరు, మంచిర్యాల
16. బసికె ధర్మరాజ్‌ (48), కడిపికొండ, వరంగల్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top