ఇక్కడ కూడా అమ్మాయిలదే హవా | girls are top in inter results | Sakshi
Sakshi News home page

ఇక్కడ కూడా అమ్మాయిలదే హవా

Apr 28 2015 11:18 AM | Updated on Aug 18 2018 9:23 PM

పరీక్షల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం పది గంటలకు ఏపీ మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేశారు.

కర్నూలు: పరీక్షల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం పది గంటలకు ఏపీ మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో అబ్బాయిల ఉత్తీర్ణత 69.43శాతం నమోదవ్వగా అమ్మాయిలు వారికంటే 5.37శాతం ఎక్కువగా 74.80శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించారు.

కాగా, ఈ ఫలితాల్లో మొత్తం పాసయినవారి శాతం 72.07 నమోదయినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఫలితాల్లో టాప్ ప్లేస్లో కృష్ణా జిల్లా (83శాతం) రాగా, ఆఖరి స్థానంలో కడప (60శాతం) వచ్చినట్లు చెప్పారు.  ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో కూడా అమ్మాయిలే  పైచేయి సాధించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement