డెంగ్యూతో చిన్నారి మృతి | girl died due to dengue fever | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో చిన్నారి మృతి

Mar 20 2015 4:30 PM | Updated on Sep 2 2017 11:09 PM

డెంగ్యూతో ఓ చిన్నారి మృతి చెందింది.

పులివెందుల :డెంగ్యూతో బాధపడుతూ ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  పులివెందుల మండలంలోని అచ్చెవల్లి గ్రామానికి చెందిన గంగాధర రెడ్డి, అరుణ దంపతుల కుమార్తె చరిష్మా రెడ్డి(4)కి ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.

 

అయితే బాలిక డెంగ్యూతో బాధపడుతున్నట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. కాగా చికిత్స పొందుతూ బాలిక శుక్రవారం ఉదయం మృతి చెందింది. అయితే గ్రామంలో 15 రోజుల కిందట మరో చిన్నారి కూడా డెంగ్యూ మహమ్మారికి బలయ్యాడు. దీంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement