జిల్లా కలెక్టర్‌గా గిరిజాశంకర్ | girija sankar appointed as district collector | Sakshi
Sakshi News home page

జిల్లా కలెక్టర్‌గా గిరిజాశంకర్

Nov 16 2014 2:51 AM | Updated on Sep 28 2018 7:14 PM

జిల్లా కలెక్టర్‌గా గిరిజాశంకర్ - Sakshi

జిల్లా కలెక్టర్‌గా గిరిజాశంకర్

జిల్లా కలెక్టర్‌గా ఎం.గిరిజాశంకర్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సిద్ధార్థ్‌జైన్ తెలంగాణకు కేటాయింపు
నేడో రేపో ఉత్తర్వులు జారీ


సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లా కలెక్టర్‌గా ఎం.గిరిజాశంకర్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  తెలంగాణ రాష్ర్టం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన్ను కమలనాథన్ కమిటీ ఏపీకి, చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తోన్న సిద్ధార్థ్‌జైన్‌ను తెలంగాణకు కేటాయించిన విషయం విదితమే. ఐఏఎస్‌ల విభజన పూర్తయిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లోనూ ఐఏఎస్‌ల మార్పుల చేర్పులకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి.

ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్‌గా ఎం.గిరిజాశంకర్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2001 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన మదనపల్లె సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. విశాఖపట్నం, కడప జిల్లాల్లో జాయింట్ కలెక్టర్‌గా ఆయన పనిచేశారు. జూలై 6, 2012 నుంచి మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ నేడో రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయని అధికారవర్గాలు వెల్లడించాయి.

Advertisement
 
Advertisement
Advertisement