మురళి ఆత్మహత్యతో సంబంధం లేదు:ఎస్‌ఐ

Gannavaram SI Clarification On Student Murali Suicide Case - Sakshi

సాక్షి, గన్నవరం: ఆత్మహత్యకు పాల్పడ్డ డిగ్రీ విద్యార్థి మురళిపై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని, అతడి ఆత్మహత్యతో ఎటువంటి సంబంధం లేదని గన్నవరం ఎస్‌ఐ నారాయణమ్మ తెలిపారు. మురళి ఆత్మహత్యపై ఎస్‌ఐ వివరణ ఇచ్చారు. మురళి ఓవర్‌ స్పీడ్‌తో రాంగ్‌ రూట్‌లో బైక్‌ నడపడంతోనే  స్టేషన్‌కు పిలిచి మాట్లాడనని, ఎస్‌ఐ అయితే నాకేంటి అంటూ దురుసుగా ప్రవర్తించాడని తెలిపారు. ఇదే విషయాన్ని సీఐ దృష్టికి తీసుకెళ్ళానని చెప్పారు. చదువుకుంటూ టీ దుకాణం నడిపే మురళి తమకు ముందు నుంచి పరిచయస్తుడేనని, స్టేషన్‌కు పిలిచాం కానీ, ఎటువంటి వార్నింగ్‌ ఇవ్వలేదని ఎస్‌ఐ నారాయణమ్మ స్పష్టం చేశారు. తన భర్త కూడా ఎలాంటి హెచ్చరికలు కానీ, బెదిరించడం కానీ చేయలేదని ఆమె తెలిపారు. కాగా ఎస్‌ఐ నారాయణమ్మ వేధింపుల వల్ల తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు డిగ్రీ విద్యార్థి మురళి గన్నవరంలోని కోనాయిచెరువులో దూకి ప్రాణాలు తీసుకున్న విషయం తెలిసిందే.

(చదవండి:నా చావుకు ఎస్‌ఐ వేధింపులే కారణం)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top