గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టు | ganja smugglers in vizianagaram District | Sakshi
Sakshi News home page

గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టు

Jul 5 2019 7:34 PM | Updated on Jul 5 2019 9:10 PM

ganja smugglers in vizianagaram District - Sakshi

సాక్షి, విజయనగరం: గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టు అయింది. జిల్లాలోని పాచిపెంట మండలం.. ఆంధ్రా, ఒడిషా సరిహద్దులో భారీ ఎత్తున అక్రమ రవాణా చేస్తున్న గంజాయి బయటపడింది. మండల పోలీసులు.. గంజాయి స్మగ్లర్లపై ముందస్తు సమాచారంతో సరిహద్దులో ప్రాంతంలో వాహనాలను తనిఖీలు చేశారు. దీంతో పోలీసుల తనిఖీలను పసిగట్టిన స్మగ్లర్లు గంజాయి ఉన్న తమ వ్యాన్‌ను వేగంగా నడిపి ఓ చోట బోల్తా కొట్టించి పరారయ్యారు. పరారైన గంజాయి స్మగ్లర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బోల్తా పడిన వ్యాన్‌లో సుమారు వందకుపైగా బ్యాగుల్లో ఉన్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement