సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై సామూహిక అత్యాచారం | gang rape on teenage girl in pendurthi | Sakshi
Sakshi News home page

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై సామూహిక అత్యాచారం

Mar 6 2015 11:24 PM | Updated on Sep 2 2017 10:24 PM

మహిళలు, టీనేజ్ బాలికలపై అకృత్యాలు శృతిమించుతూనే ఉన్నాయి.

విశాఖపట్నం: విశాఖ నగరంలో ఒక యువతి అత్యాచారానికి గురైంది. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఈ నెల 4వ తేదీన విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం వేపగుంటలో ఓ వివాహ వేడుకకు వచ్చింది. అక్కడి నుంచి రాంనగర్‌లోని పెళ్లికూతురు ఇంటికి వెళ్లి నిద్రించింది. 5వ తేదీ తెల్లవారుజామున హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరకు వచ్చింది. అక్కడ శివ శేఖర్, కిరణ్, మణికంఠ, చందు అనే నలుగురు యువకులు ఆ యువతిని అపహరించి కారులో సర్క్యూట్ హౌస్ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ ఆ నలుగురిలో ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను ఆర్టీసీ బస్టాండ్ వద్ద వదిలి వెళ్లారు. బాధితురాలు ఈ విషయాన్ని రెల్లి వీధిలోని స్నేహితులకు తెలిపింది. దీంతో వారు వచ్చి ఆమెను తీసుకువెళ్లి ఆశ్రయం ఇచ్చారు.

 

కాగా, 6వ తేదీ సాయంత్రం నిందితుల్లో ఒకడైన శివశేఖర్ ఆమెకు ఫోన్ చేసి హైదరాబాద్ టిక్కెట్ తీసి పంపిస్తానని, ఆర్టీసీ కాంప్లెక్స్‌కు రమ్మని చెప్పాడు. దీంతో స్నేహితుల సాయంతో ఆమె కాంప్టెక్స్‌కు చేరుకుంది. శివశేఖర్ అక్కడకు రాగానే అతనిని పట్టుకుని కాంప్లెక్స్ వద్ద నున్న అవుట్‌పోస్ట్ పోలీసులకు అప్పగించారు. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement