పోలీసుల దాడి: పేకాటరాయుడు మృతి | Gambler dies in police attack, Visakhapatnam district | Sakshi
Sakshi News home page

పోలీసుల దాడి: పేకాటరాయుడు మృతి

Dec 24 2014 10:07 AM | Updated on Aug 21 2018 6:12 PM

విశాఖపట్నం జిల్లా నర్సిపట్నం మండలం వేములపూడిలోని పేకాట స్థావరంపై పోలీసులు మంగళవారం అర్థరాత్రి దాడి చేశారు.

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా నర్సిపట్నం మండలం వేములపూడిలోని పేకాట స్థావరంపై పోలీసులు మంగళవారం అర్థరాత్రి దాడి చేశారు. పోలీసుల దాడితో పేకాడుతున్న వెంకటరమణ అనే వ్యక్తి తీవ్ర భయాందోళనకు గురైయ్యాడు. అంతే అక్కడి నుంచి పారిపోయే క్రమంలో మెట్లపై నుంచి జారీ కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని పోలీసులు, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వెంకటరమణ మరణించాడని వైద్యులు వెల్లడించారు. వెంకటరమణ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని స్థానికులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement