'కేసీఆర్ మొదటి దోషి' | gali muddu krishnama naidu allegations on kcr | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ మొదటి దోషి'

Jun 30 2015 1:21 PM | Updated on Sep 3 2017 4:38 AM

'కేసీఆర్ మొదటి దోషి'

'కేసీఆర్ మొదటి దోషి'

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి దోషి అని, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ రెండో దోషి అని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు.

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి దోషి అని, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ రెండో దోషి అని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం వీరిద్దరిపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పదేళ్ల వరకు పెత్తనం లేదని సెక్షన్ 8 చెబుతోందన్నారు. గవర్నర్ కే అధికారాలుంటాయని చెప్పారు. ఏదైనా చర్య తీసుకోవాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలన్నారు. హైదరాబాద్ లో తమ పోలీస్ స్టేషన్ పెట్టుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement