ఫోన్‌ ట్యాపింగ్‌పై ఈ నెలలోనే చార్జిషీట్‌ | Telangana Phone Tapping Case SIT Likely to File Chargesheet in June | Sakshi
Sakshi News home page

ఫోన్‌ ట్యాపింగ్‌పై ఈ నెలలోనే చార్జిషీట్‌

Jun 2 2026 5:38 AM | Updated on Jun 2 2026 5:38 AM

Telangana Phone Tapping Case SIT Likely to File Chargesheet in June

సిట్‌ విచారణ అనంతరం సీఎల్పీలో ఎమ్మెల్యేలు యెన్నెం, అనిరుధ్‌

వ్యవస్థీకృత నేరమైన ఫోన్‌ ట్యాపింగ్‌ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో భాగంగా ఈ నెలలోనే చార్జి షీట్‌ దాఖలు చేస్తామని సిట్‌ అధికా రులు చెప్పారని మహబూబ్‌నగర్‌ ఎ మ్మెల్యే, ప్రభుత్వ విప్‌ యెన్నెం శ్రీని వాస్‌రెడ్డి వెల్లడించారు. పోలీ సులు ఇచ్చిన నోటీసులతో తాను సోమవా రం సిట్‌ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చినట్లు చెప్పారు. సిట్‌ ముందు హాజ రైన అనంతరం సీఎల్పీ మీడియా హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మరో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి (జడ్చర్ల)తో కలిసి ఆయన మాట్లాడారు.

 ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో భాగస్వాములైన వారు ఎవరైనా ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా చట్టం ముందు నిలబడాలన్నారు. డీజీపీ నుంచి కానిస్టేబుల్‌ వరకు ఎమ్మెల్యే నుంచి సీఎం వరకు బాధ్యులందరిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వారిపై కోర్టులు కఠిన చర్యలు తీసుకుంటాయనే నమ్మకం తనకు ఉందని యెన్నెం తెలిపారు.

నా తల్లి, భార్య నంబర్లనూ వదల్లేదు: అనిరుధ్‌రెడ్డి
గతంలో ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిన నంబర్లు చూస్తే బాధేసిందని.. తన తల్లి, భార్య నంబర్లు కూడా ఆ జాబితాలో ఉన్నాయని సిట్‌ ముందు సోమవారం హాజరైన మరో ఎమ్మెల్యే జె. అనిరుధ్‌రెడ్డి చెప్పారు. ఈ దృష్ట్యా రాజకీయాలు వద్దని తన భార్య అంటోందన్నారు. భార్యతో మాట్లాడిన మాటలను కూడా వింటారా అని ఆయన ప్రశ్నించారు. తన కార్‌ డ్రైవర్, అతని భార్య నంబర్‌ కూడా ట్యాప్‌ చేశారని.. ఇదేం ఘోరమని నిలదీశారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సీఎం రేవంత్‌ను కోరారు.

పవన్‌ కల్యాణ్‌కు తెలంగాణతో ఏం పని?
తెలంగాణ కండ్లు నరదిష్టి అని మాట్లాడిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు తెలంగాణతో ఏం పని అనిరుధ్‌రెడ్డి ప్రశ్నించారు. ఏపీ నేతలు తెలంగాణపై విద్వేషం చిమ్ముతుంటే బీఆర్‌ఎస్‌ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర పార్టీలతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకుంటుందనే సంకేతాలను ఇప్పుడే ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement