ఏడు అసెంబ్లీ స్థానాలకు | Further by appointing a new seven Assembly seats | Sakshi
Sakshi News home page

ఏడు అసెంబ్లీ స్థానాలకు

Mar 17 2014 5:08 AM | Updated on Mar 9 2019 3:59 PM

బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోనున్న ఏడు అసెంబ్లీ స్థానాలకు త్వరలో కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించనున్నట్లు కేంద్రమంత్రి పనబాక లక్ష్మి తెలిపారు.

త్వరలో ఇన్‌చార్జ్‌ల నియామకం
 
 కేంద్రమంత్రి పనబాక లక్ష్మి

 
 చీమకుర్తి, న్యూస్‌లైన్: బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోనున్న     ఏడు అసెంబ్లీ స్థానాలకు త్వరలో కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించనున్నట్లు కేంద్రమంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. చీమకుర్తిలోని డాక్టర్ జవహర్ ఆస్పత్రి ఆవరణలో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
 
 ఈ సందర్భంగా పనబాక మాట్లాడుతూ ఇన్‌చార్జిలను నియమించేందుకు ఈ పాటికే ప్రతిపాదనలను పంపించామని, అవి ఆమోదం పొందగానే అసెంబ్లీ స్థానాల్లో కొత్త ఇన్‌చార్జిలు వస్తారన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే విజయకుమార్ ఉన్నారుగదా..? అని విలేకరులు గుర్తు చేయగా ఆయన టచ్‌లో లేరని అందువలనే ఇన్‌చార్జిని నియమించాల్సి వస్తుందని తెలిపారు.
 
 ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలన్నిటిలోనూ కాంగ్రెస్‌పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. రానున్న రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కీరోల్ వహించనుందని అన్నారు. అనంతరం కాంగ్రెస్‌పార్టీ తరఫున ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు.
 
  ఆమె వెంట ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వేమా శ్రీనివాసరావు, అవిశనేని వెంగన్న, కడియాల సుబ్బారావు, పాలడుగు తిరుపతయ్య, బండి శ్రీహరి, డాక్టర్ బీ.జవహర్ ఉన్నారు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement