స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్’’ అని ఎంత ప్రచారం చేసినా యువత పెడచెవిన పెడుతోంది. మితిమీరిన వేగంతో ప్రాణాలు కోల్పోతున్నారు. వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులు స్తున్నారు. చేతికి అంది వచ్చిన కొడుకుల్ని చూసి, ముసలి తనంలో ఆదుకుంటారనే వారి ఆశల్ని అడియాశలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎక్స్‌లో షేర్ చేశారు. ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన, అతివేగం ,నిర్లక్ష్యంగా డ్రైవింగ్ కారణంగా ఎన్నో జీవితాలు అంధకారంలోకి జారిపోతున్నాయి. జీవితాలు, కుటుంబాలు వారి భవిష్యత్తు కూడా విచ్ఛిన్నమవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
⚠️ Speed thrills, but kills!
Overspeeding and reckless driving don’t just break traffic rules — they break lives, families, and futures.
ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.#FallowTrafficRules pic.twitter.com/HWT3Gl3Cz4— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 6, 2025
యుక్తవయసులోనేకన్నకొడుకుల్నికోల్పోతున్న వారి కడుపుకోతను తీర్చేదెవరు? ఇలాంటి ప్రమాదాలను చూసినపుడైనా యువత ఆలోచనల్లో, ప్రవర్తనలో మార్పు రావాలి. వస్తుందని ఆశిద్దాం.
ఇదీ చదవండి: తండ్రి త్యాగం, కొడుకు సర్‌ప్రైజ్ : నెటిజనుల భావోద్వేగం


