వైరల్ వ్యాధులపై పరిశోధనలకు నిధులు


 విజయవాడ, న్యూస్‌లైన్: మొండి వ్యాధులపై పరిశోధనలకు విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి  ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నుంచి భారీగా నిధులు అందనున్నాయి.  ప్రవేశాలు, పరీక్షలు నిర్వహిండానికే పరిమితమైన ఈ యూనివర్శిటీ ఇక పరిశోధనలకూ పెద్దపీట వేయనుంది. రాష్ట్రంలో 2014 చివరినాటికి మూడు మల్టీ డిసిప్లీనరీ రీసెర్చ్ యూనిట్ (ఎండీఆర్‌యూ)లు ఏర్పాటు కానున్నాయి. సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల (విజయవాడ), ఉస్మానియా వైద్య కళాశాల (హైదరాబాద్), శ్రీవెంకటేశ్వర వైద్య కళాశాల(తిరుపతి)లలో ఏర్పాటయ్యే ఈ యూనిట్లకు ఒక్కో దానికి రూ.5.25 కోట్ల నిధులు ఐసీఎంఆర్ నుంచి అందనున్నాయి. కాంట్రాక్టు సిబ్బంది నియామకానికి రూ.19 లక్షలు, రసాయనాలకు మరో రూ.15 లక్షలూ అందుతాయి. మూడేళ్ల ప్రోగ్రామ్ కింద అంటువ్యాధులు కాని వ్యాధులైన డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కేన్సర్, గుండె జబ్బులపై ఫ్యాక ల్టీ పరిశోధనలు చేస్తుంది.

 

 మూడు స్థాయిల్లో వైరాలజీ ల్యాబ్‌లు...

  రీజియన్ల వారీగా మూడు స్థాయిల్లో నెట్‌వర్క్ వైరల్ ల్యాబొరేటరీస్‌ను ఐసీఎంఆర్ నెలకొల్పనుంది.

  చెన్నైలో ప్రాంతీయ ప్రయోగ శాలను, దానికి అనుబంధంగా ఆయా రాష్ట్రాల్లో 150 వైరాలజీ ప్రయోగశాలలు ఏర్పాటు చేయనున్నారు.

 

  ఏపీలో ఉస్మానియా వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి ప్రయోగశాలగా అనుమతి లభించింది. ఉస్మానియా వైద్య కళాశాల పర్యవేక్షణలో రాష్ట్రంలో మరో 11 వైద్య కళాశాలల్లో కళాశాల స్థాయి ప్రయోగశాలలు ఏర్పాటు కానున్నాయి.  

 

  అంటువ్యాధుల నివారణ, వైద్యపరంగా జాతీయ విపత్తులు (మొదడువాపు, ఫైలేరియా, ఆంత్రాక్స్, స్వైన్‌ఫ్లూ, కొత్తకొత్త అంటువ్యాధులు ప్రబలడం) సంభవిస్తే వాటిని ఎదుర్కొనేందుకు ఈ నెట్‌వర్క్ ల్యాబ్‌లు ప్రభుత్వానికి తోడ్పడతాయి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top