మృత్యువు లోనూ వారు స్నేహాన్ని వీడలేదు. స్నేహితుడికి ఈత మునిగిపోతుండడంతో అతడిని కాపాడబోయి తానూ మృతి చెందాడు. ఈ విషాద సంఘటన మండలంలోని రాంపూర్ శివారులో గల కూడవెల్లి వాగులో శనివారం చోటు చేసుకుంది.
తొగుట, న్యూస్‌లైన్ :
మృత్యువు లోనూ వారు స్నేహాన్ని వీడలేదు. స్నేహితుడికి ఈత మునిగిపోతుండడంతో అతడిని కాపాడబోయి తానూ మృతి చెందాడు. ఈ విషాద సంఘటన మండలంలోని రాంపూర్ శివారులో గల కూడవెల్లి వాగులో శనివారం చోటు చేసుకుంది. సీఐ రమేష్‌బాబు కథనం మేరకు.. జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన బట్టు రాజశేఖర్‌రెడ్డి (25) గజ్వేల్ మండలం బయ్యారం గ్రామానికి చెందిన కోమటిబండ గణేష్ (20)లు రంగారెడ్డి జిల్లా తుర్కపల్లిలోని జీ4 ఎస్ కంపెనీలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఇదే కంపెనీలో పనిచేస్తున్న మరో ఆరుగురు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాలని నిర్ణయించారు. అందులో భాగంగా శనివారం తొగుట మండలం రాంపూర్ శివారులో ఉన్న కోటిలింగాల ఆలయానికి వెళ్లారు.
అక్కడున్న కూడవెల్లి వాగులో దిగి ఈత కొడుతున్నారు. అయితే రాజశేఖర్‌రెడ్డి, గణేష్‌లు ఒక వైపు ఆరుగురు స్నేహితులు మరో వైపు ఈత కొడుతున్నారు. అయితే గణేష్‌కు ఈత రానందున నీటిలో మునిపోతుం డగా రక్షించబోయిన రాజశేఖర్‌రెడ్డి కూ డా అందులో మునిగిపోయాడు. విషయాన్ని గమనించిన స్నేహితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకుని గ జ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ మంజూరు హుస్సేన్ తెలిపారు.
రోదనలతో దద్దరిల్లిన సంఘటనా స్థలం
చేతికొచ్చిన ఇద్దరు ప్రమాదవశాత్తు మృతి చెందడంతో కుటుంబీకులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమం తా మార్మోగింది. ఈ విషయం తెసుకున్న చుట్టుపక్కల గ్రామాల వారు అక్కడికి చేరుకుని కంటతడిపెట్టారు. ఇదిలా ఉండగా.. గణేష్ తండ్రి చిన్నతనంలోనే మృతి చెందడంతో కుటుంబ భారమంతా అతనే మోస్తున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు విజయ్‌రెడ్డి, నాయకులు సుధాకర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, నాగరాజు, నిరంజన్‌రెడ్డి తదితరులు మృతులు కుటుంబాలను ఓదార్చారు.
యువకుల మృతితో గ్రామాల్లో విషాదం
గజ్వేల్ రూరల్/ జగదేవపూర్, న్యూస్‌లైన్ : గజ్వేల్ మండలం బయ్యారం గ్రామానికి చెందిన గణేష్ (22), జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామనికి చెందిన బట్టు రాజశేఖర్‌రెడ్డి (25) తొగుట మండలంలోని చెరువులో పడి మృతి చెందడంతో వారి గ్రామంల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. రంగారెడ్డి జిల్లా తుర్కపల్లిలోని జీ4ఎస్ కంపెనీలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న వీరు మరో ఆరుగురి స్నేహితులతో కలిసి తొగుట మండలం రాంపూర్ శివారులో ఉన్న కోటిలింగాల ఆలయానికి వెళ్లారు. పక్కనే ఉన్న కూడవెల్లి వాగులో ఈతకు దిగారు. ఇందులో బయ్యారానికి చెందిన గణేష్‌కు ఈత రాకపోడవంతో చెరువులో మునిగిపోతున్న క్రమంలో తీగుల్ గ్రామనికి చెందిన రాజశేఖర్ కాపాడే క్రమంలో ఇద్దరు వృతి చెందారు. దీంతో ఆయా గ్రామంలోని వారి వారి కుటుంబల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.


