తిరుమలలో లడ్డు కౌంటర్ సిబ్బంది ఒకరు చేతివాటం ప్రదర్శించాడు.
సాక్షి, తిరుమల: తిరుమలలో లడ్డు కౌంటర్ సిబ్బంది ఒకరు చేతివాటం ప్రదర్శించాడు. 40 వ లడ్డూ కౌంటర్‌లో ఉన్న ఉద్యోగి కర్ణాటకకు చెందిన భక్తులకు 104 లడ్డులు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 50 లడ్డూలు మాత్రమే ఇచ్చాడు. దీనిపై అడిగినందుకు భక్తులపై బెదిరింపులకు దిగాడు.
ఈ విషయాన్ని అక్కడే ఉన్న సాక్షి విలేకరి విజిలెన్స్ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. విజిలెన్స్ అధికారులు రాకను గమనించిన 40వ కౌంటర్ ఉద్యోగి పరారయ్యాడు. అనంతరం కర్ణాటకు చెందిన భక్తులకు టీటీడీ నిర్వాహకులు 104 లడ్డూలను అందజేశారు. పరారైన ఉద్యోగి కోసం విచారణ చేపడుతున్నారు.