కడప కేంద్ర కారాగారం నుంచి నలుగురు జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తులు సోమవారం సాయంత్రం పరారయ్యారు.
కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : కడప కేంద్ర కారాగారం నుంచి నలుగురు జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తులు సోమవారం సాయంత్రం పరారయ్యారు. సాయంత్రం సమయంలో కారాగారం వెనుక వైపు ఉన్న టవర్ వద్ద నిచ్చెన వేసుకుని పరారైనట్లు పోలీసులు తెలిపారు. రవి, రామచంద్ర, దేవ, హనుమంతు అనే జీవిత ఖైదీలు పారిపోయినట్లు తెలిసింది.