జూనియర్లతో డ్యాన్స్ చేయించిన హౌస్ సర్జన్ల సస్పెన్షన్ | Four house surgeons suspension in medical college at Anantapur | Sakshi
Sakshi News home page

జూనియర్లతో డ్యాన్స్ చేయించిన హౌస్ సర్జన్ల సస్పెన్షన్

Oct 14 2014 8:57 AM | Updated on Oct 9 2018 6:57 PM

నగరంలోని మెడికల్ కాలేజీలో జూనియర్లపై సీనియర్ మెడికోల ర్యాగింగ్ ఘటనపై ఆ కాలేజీ ప్రిన్సిపల్ నీరజారెడ్డి సీరియస్ అయ్యారు.

అనంతపురం: నగరంలోని మెడికల్ కాలేజీలో జూనియర్లపై సీనియర్ మెడికోల ర్యాగింగ్ ఘటనపై ఆ కాలేజీ ప్రిన్సిపల్ నీరజారెడ్డి సీరియస్ అయ్యారు. అందుకు బాధ్యులైన నలుగురు హౌస్ సర్జన్లను విధుల నుంచి ప్రిన్సిపల్ తప్పించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. విచారణలో హౌస్ సర్జన్లు దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అనంతపురంలోని మెడికల్ కాలేజీలో శనివారం అర్థరాత్రి సీనియర్ మెడికోలు...  జానియర్లను ర్యాగింగ్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని జూనియర్లు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన సీనియర్లు....జూనియర్లతో బలవంతంగా దుస్తులు విప్పించి డాన్సులు చేయించారు. అనంతరం బాధితులు సహచర విద్యార్థులతో కలసి కాలేజీ ఉన్నతాధికారులకు ర్యాగింగ్పై ఫిర్యాదు చేశారు. దాంతో కాలేజీ ప్రిన్సిపల్ విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement