కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు తండ్రి, కేంద్ర మాజీ మంత్రి శ్రీరామ సంజీవరావు బుధవారం మరణించారు.
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు తండ్రి, కేంద్ర మాజీ మంత్రి శ్రీరామ సంజీవరావు బుధవారం మరణించారు. ఇందిరా గాంధీ ప్రభుత్వంలో ఆయన కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేశారు. కాకినాడ నియోజకవర్గం నుంచి మూడు సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు.
ఎం పళ్లంరాజు కూడా కేంద్ర మంత్రిగా పనిచేసిన విషయం విదితమే. పళ్లంరాజు కూడా కాకినాడ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూశారు.