టీడీపీలోకి దగ్గుబాటికి స్వాగతం అంటూ ఫ్లెక్సీలు | Flexi Controversy over daggubati venkateswara rao in parchuru | Sakshi
Sakshi News home page

టీడీపీలోకి దగ్గుబాటికి స్వాగతం అంటూ ఫ్లెక్సీలు

Jan 28 2014 11:11 AM | Updated on Oct 2 2018 7:28 PM

టీడీపీలోకి దగ్గుబాటికి స్వాగతం అంటూ ఫ్లెక్సీలు - Sakshi

టీడీపీలోకి దగ్గుబాటికి స్వాగతం అంటూ ఫ్లెక్సీలు

సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తిరిగి టీడీపీలోకి రావాలంటూ వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.

ఒంగోలు : ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా పర్చూరులో ఫ్లెక్సీల రగడ నెలకొంది. సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తిరిగి టీడీపీలోకి రావాలంటూ వెలిసిన  ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.

టీడీపీలోకి దగ్గుబాటికి తిరిగి స్వాగతం అంటూ  ఆ ఫ్లెక్సీలు వెలిశాయి. కాగా అర్థరాత్రి దాటిన తర్వాత ఆ ఫెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు. ఆ ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేశారన్నది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. కాగా పర్చూరు నుంచి ప్రస్తుతం దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement