విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఐదుగురు వీఆర్వోలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సిద్దార్ధజైన్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఓ ఆర్‌ఐకి షోకాజ్ నోటీసు ఇచ్చారు.
ఏలూరు రూరల్, న్యూస్‌లైన్ : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఐదుగురు వీఆర్వోలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సిద్దార్ధజైన్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఓ ఆర్‌ఐకి షోకాజ్ నోటీసు ఇచ్చారు. నరసాపురం మండలం వేములదీవి గ్రామంలో బినామి భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు సహకరించడంతోపాటు విధి నిర్వహణలో అలసత్వం వహించాడని నరసాపురం ఆర్‌ఐ వై.శ్రీనివాస్‌కు కలెక్టర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇదే విషయంలో వేములదీవి క్లస్టర్-2 వీఆర్వో ఆచంట సాయిశ్రీకృష్ణను సస్పెండ్ చేశారు.
లెహర్ తుపాను పంట నష్టాల అంచనాలో అవకతవకలకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై భీమవరం మండలం తుందుర్రు క్లస్టర్ వీఆర్వో ఎం.సంజయ్‌ను, పరిషత్ ఎన్నికల మోడల్ కోడ్ అమలులో నిర్లక్ష్యం వహించాడని భీమడోలు మండలం గుండుగొలను వీఆర్వో భోగరాజును కలెక్టర్ సస్పెండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు, బహుమతులు పంచుతున్న సమయంలో కేసు నమోదు ప్రక్రియలో అధికారులకు సహకరించలేదని భీమవరం క్లస్టర్ వీఆర్వో ముక్కామల భోగేశ్వరరావు, గునుపూడి క్లస్టర్-6 వీఆర్వో గుమ్మళ్ల జచరయ్యలను సస్పెండ్ చేశారు.