చిక్కుకుపోయాం.. ఆదుకోండి

Fishermen trapped near Mumbai - Sakshi

ముంబై సమీపంలో చిక్కుకున్న మత్స్యకారుల ఆవేదన 

లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఆందోళన

స్వగ్రామాలకు చేర్చాలంటూ ఏపీ ప్రభుత్వానికి వినతి 

సాక్షి, ముంబై: శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు ముంబైకి సమీపంలో చిక్కుకుపోయి నానా అగచాట్లుపడుతున్నారు. థాణే జిల్లా లోని ఉత్తన్‌ తీరప్రాంతంలో ఉన్న వీరంతా లాక్‌డౌన్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. సుమారు నాలుగు నెలల కిందట కళింగపట్నం, కపాసుకుద్ది, ఇద్దివానిపాలెం, కళింగపట్నం కుసుకుంపురం తదితర ప్రాంతాల నుంచి సుమా రు 200 మంది ముంబైకి సమీపంలోని ఉత్తన్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ పనుల్లేవని, లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికొచ్చే అవకాశమూ లేకుండాపోయిందని ఆందోళన చెందుతున్నారు. తమలో ఒకరికి కిడ్నీ సమస్య ఉందని.. మందులు కూడా లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను స్వగ్రామాలకు తరలించాలని ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వారు పడుతున్న వెతలను ‘సాక్షి’తో చెప్పుకున్నారు.

మమ్మల్ని ఇంటికి చేర్చండి..   
మమ్మల్ని ఎలాగైనా మా గ్రామాలకు చేర్చండి. ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతు న్నాం. మా కుటుంబ సభ్యులు కూడా∙ఆందోళనలో ఉన్నారు.                   
– ఇద్ది దుర్యోదన్‌  

ఒక పూటే తింటున్నాం..    
ఇక్కడ పనులు కూడా లేకపోవ డంతో ఒక పూటే తింటున్నాం. ఒక నెల పాటు బాగానే ఉన్నా..  లాక్‌డౌన్‌ పొడిగించడంతో కష్టాలు మొదలయ్యాయి. 
 – మద్దు మోహన్‌రావు  

ఏపీకి తీసుకొస్తాం..
ముంబైలో చిక్కుకున్న మత్స్య కారులను ఏపీకి తెచ్చే  ప్రయ త్నాలు జరుగుతున్నాయి. ముంబై సమీపంలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లా మత్స్య కారులనూ రాష్ట్రానికి  తీసుకొస్తాం. 
– మంత్రి మోపిదేవి వెంకటరమణారావు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top