ఏమిటీ వింత..! భూమి పొరల్లోంచి మంట | Fires Coming Out From The Ground In Kurnool District | Sakshi
Sakshi News home page

Oct 13 2018 5:05 PM | Updated on Oct 13 2018 9:28 PM

Fires Coming Out From The Ground In Kurnool District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కర్నూలు : జిల్లాలోని అవుకు మండలం మర్రికుంట తండా సమీపంలో వింత ఘటన చోటు చేసుకుంది. తండాకు దగ్గర్లోని కొండ ప్రాంతంలో 50మీటర్ల పొడవు, ఒక అడుగు వెడల్పుతో భూమి చీలిపోయింది. అందులో నుంచి మంటలు చెలరేగడంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎలాంటి ఉత్పాతం సంభవిస్తుందోనని తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. 

కాగా, ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో ప్రజలు తండోపతండాలుగా అక్కడకు చేరుకుంటున్నారు. భూమి పొరల నుంచి వెలువడుతున్న మంటల ప్రభావంతో సమీపంలోని విద్యుత్ స్తంభం కూలిపోయింది. మంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అంతుబట్టడం లేదు. స్థానికులు విషయాన్ని తహసీల్దారు సంజీవయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న సంజీవయ్య జియాలాజికల్‌ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement