శ్రీకాళహస్తీశ్వరాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణద్వారం వద్ద ఉన్న ఓ షాపులో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది.
చిత్తూరు: శ్రీకాళహస్తీశ్వరాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణద్వారం వద్ద ఉన్న ఓ షాపులో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలార్పేయడంతో ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్‌సర్క్యూటే కారణంగానే మంటలంటుకున్నాయని ఆలయ సిబ్బంది తెలిపారు.
కాగా, శ్రీకాళహస్తి స్వామివారిని ఇస్రో చైర్మన్ కె రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ25 ఉపగ్రహక వాహకనౌకను రేపు ప్రయోగించనున్న నేపథ్యంలో ఆయనిక్కడకు వచ్చారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎంవోఎం) ఉపగ్రహాన్ని మోసుకుని పీఎస్‌ఎల్‌వీ సీ25 ఉపగ్రహ వాహకనౌక మంగళవారం మధ్యాహ్నం 2:38 గంటలకు నింగికి దూసుకుపోనుంది.