అగ్నికి ఆహుతైన 17 ఇళ్లు | fire accident in vijayanagaram district | Sakshi
Sakshi News home page

అగ్నికి ఆహుతైన 17 ఇళ్లు

Oct 31 2017 2:23 PM | Updated on Sep 5 2018 9:47 PM

విజయనగరం జిల్లా నెల్లిమర్లలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది.

సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లా నెల్లిమర్లలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 ఇళ్లు దగ్ధమయ్యాయి. అలాగే లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లింది. తొలుత ఓ ఇంట్లో నుంచి వచ్చిన మంటలు గాలికి పక్కనే ఉన్న ఇళ్లకు కూడా వ్యాపించడంతో అవి కూడా దగ్ధమయ్యాయి. సమాచారమందుకున్నఅగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఇళ్లల్లోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతి అవ్వడంతో బాధితులు బోరున విలపించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement