తహశీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం | Fire accident in Tahsildar office | Sakshi
Sakshi News home page

తహశీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం

Jan 10 2016 12:35 PM | Updated on Apr 4 2019 2:50 PM

తహశీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడంతో.. కార్యాలయంలోని విలువైన వస్తువులతోపాటు జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల దరఖాస్తులు కాలి బూడిదయ్యాయి.

మడకశిర (అనంతపురం) : తహశీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడంతో.. కార్యాలయంలోని విలువైన వస్తువులతోపాటు జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల దరఖాస్తులు కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా మడకశిర తహశీల్దార్ కార్యాలయంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. శనివారం రాత్రి 2 గంటల వరకు జన్మభూమి దరఖాస్తులను పరిశీలించిన కార్యాలయ సిబ్బంది అనంతరం తాళాలు వేసి వెనుదిరిగారు.

ఆ తర్వాత కార్యాలయంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో కార్యాలయంలో ఉన్న కంప్యూటర్, స్కానర్, ప్రింటర్, ఫర్నీచర్‌తోపాటు మొలవాయి గ్రామానికి సంబంధించిన జన్మభూమి దరఖాస్తులు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement