తాడేపల్లిలో పలుచోట్ల అగ్నిప్రమాదాలు | fire accident in tadepally | Sakshi
Sakshi News home page

తాడేపల్లిలో పలుచోట్ల అగ్నిప్రమాదాలు

May 23 2015 2:45 PM | Updated on Sep 5 2018 9:45 PM

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

గుంటూరు (తాడేపల్లి): గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చిరావూరు గ్రామంలో కరెంటు తీగలు తెగి మంటలు చెలరేగటంతో అరటి తోట దగ్ధం కాగా, పాతూరులో గుర్తుతెలియని వ్యక్తులు మొక్కజొన్న తోటకు నిప్పుపెట్టారు. కుంచనపల్లిలో శ్రీనివాస్‌రావు అనే రైతుకు చెందిన ఆకుకూర పంటకి నిప్పుపెట్టటంతో పంట బుగ్గిపాలయింది. ఆ సమయంలో పక్కనే ఉన్న పలగాని వెంకటేశ్వరరావుకి చెందిన ద్విచక్ర వాహనం కూడా కాలపోయింది. గుండెమడ, చిరావూరు మధ్యలో కృష్ణా నదిలోని ఇసుక దిబ్బలో ఉన్న 25 ఎకరాల విస్తీర్ణంలోని పశుగ్రాసానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో పూర్తిగా కాలిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement