ఫ్రీడం రిపైండ్ ఆయిల్ గోడౌన్లో అగ్నిప్రమాదం | Fire accident in Freedom Refined oil godown at gollapudi | Sakshi
Sakshi News home page

ఫ్రీడం రిపైండ్ ఆయిల్ గోడౌన్లో అగ్నిప్రమాదం

Mar 20 2014 8:23 AM | Updated on Sep 5 2018 9:45 PM

ఫ్రీడం రిపైండ్ ఆయిల్ గోడౌన్లో అగ్నిప్రమాదం - Sakshi

ఫ్రీడం రిపైండ్ ఆయిల్ గోడౌన్లో అగ్నిప్రమాదం

విజయవాడలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గొల్లపూడిలోని ఫ్రీడం రిఫైండ్ ఆయిల్ గోదాములో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

విజయవాడ : విజయవాడలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గొల్లపూడిలోని ఫ్రీడం రిఫైండ్ ఆయిల్ గోదాములో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు వ్యాపించాయి. గోదాములో మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్నఅగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు కోటి  రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement