కృష్ణాడెల్టా నీటి హక్కుల్ని కాపాడతాం: దేవినేని | fight for Krishna Delta water rights | Sakshi
Sakshi News home page

కృష్ణాడెల్టా నీటి హక్కుల్ని కాపాడతాం: దేవినేని

Jul 4 2014 1:18 AM | Updated on Sep 2 2017 9:46 AM

కృష్ణాడెల్టా నీటి హక్కుల్ని కాపాడతాం:  దేవినేని

కృష్ణాడెల్టా నీటి హక్కుల్ని కాపాడతాం: దేవినేని

కృష్ణాడెల్టా తాగు, సాగునీటి హక్కుల్ని పూర్తిస్థాయిలో కాపాడతామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

సాక్షి, విజయవాడ బ్యూరో: కృష్ణాడెల్టా తాగు, సాగునీటి హక్కుల్ని పూర్తిస్థాయిలో కాపాడతామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో  గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...డెల్టాకు తాగునీటి విడుదలను వ్యతిరేకిస్తున్న తెలంగాణ మంత్రుల తీరు సబబు కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన సాగర్ జలాల కోసం ఎంత వరకైనా వెళ్తామనీ, సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో 100 రోజుల జల ప్రణాళికను ఖరారు చేశామనీ, నూరుపాళ్లు దీన్ని అమలు చేస్తామన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement