రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల మృతి | father and sun died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల మృతి

Nov 4 2015 8:35 AM | Updated on Aug 30 2018 3:56 PM

ద్విచక్రవాహనం పై వెళ్తున్న తండ్రీ కొడుకులు గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు.

వెంపల్లే: ద్విచక్రవాహనం పై వెళ్తున్న తండ్రీ కొడుకులు గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. ఈ సంఘటన వైఎస్సార్‌ కడప జిల్లా వెంపల్లె మండలం బి. వెలమావారి పల్లె గ్రామ శివారులో బుధవారం ఉదయం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు తండ్లూరి వీరయ్య(50), బాబా ఫక్రుద్దీన్(24) కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో మండల కేంద్రంలో ఉన్న కూరగాయల విక్రయ కేంద్రానికి బైక్‌ పై వెళ్తున్న సమయంలో గ్రామ శివారులోకి చేరుకోగానే గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement